బాబా షిరిడి బంగరు షిరిడి
1.శ్రీ సాయి పాదము శ్రీ షిరిడి వాసుని పాదము
ప. ఏమిపాదము నీదు పాదము దివ్య పాదము
మహిమలెన్నో మహిన చూపిన మేటి పాదము
శ్రీ సాయి పాదము
1.షిరిడి నేలను పుణ్య భూమిగ మార్చినట్టి పాదము
భరత భూమిని భాగ్య శీలగ తీర్చినట్టి పాదము
గంగ యమున పుణ్య నదుల ప్రవహింపజేసిన పాదము
భక్త దాస గణాది భక్తుల బ్రోచినది ఈ పాదము
2.కృష్టు వ్యాధి భాగోజీని కాచినట్టి పాదము
కమ్మరి బాలుని అగ్ని నుండి కాపాడిన పాదము
మైనతాయికి ప్రసవ వేదన తీసివేసిన పాదము
గీతార్ధ శ్లోక బోధన చెప్పినట్టి పాదము
3.జలముతోనే జ్వలన చేసిన దీపకాంతి పాదము
జ్ఞాన జ్యోతుల వెలుగుతోనే భక్తి చూపిన పాదము
బ్రహ్మ జ్ఞానము బోధించి ముక్తి చూపిన పాదము
నాణెములతో నవ విధ భక్తి తెలిపినట్టి పాదము
4.కులము మతములు యేవి లేవని చెప్పినట్టి పాదము
సమత మమత చూపినట్టి సామరస్య పాదము
సగుణ బ్రహ్మ ఆకారమై వచ్చినట్టి పాదము
ఏకాదశ సూత్రములనే అభయమొసగిన పాదము
5.ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయినే
ద్వాదశ మంత్ర జపము యిచ్చినట్టి పాదము
రామకృష్ణ శివ మారుతి దత్త దేవుని పాదము
అల్లా యేసు నానక్ గోవింద వొక్కటన్న పాదము
అందరి దైవము వోక్కడేనని బోధించిన పాదము
రచన: శ్రీ మొల్లి అప్పారావు
రచన: శ్రీ మొల్లి అప్పారావు
శ్రీ మొల్లి అప్పా రావు గారు విశాఖపట్నము హార్బరు లో వుద్యోగ విరమణ అనంతరము షిరిడి సాయిబాబా సేవలో నిమగ్నులైనారు. సర్వీసులో వున్నప్పటినుండి కూడా యెన్నో పాటలు శ్రీ షిరిడి సాయి బాబా వారి మీద వ్రాసి వున్నారు. యింకా వ్రాస్తూనే వున్నారు. సాయి బాబా భజనలు,శ్రావ్యమైన స్వరముతో పాటలు పాడడము వీరికి వెన్నతో పెట్టిన విద్య.
================================
2. సాయి షిరిడి చక్కని షిరిడి
ప..బాబా షిరిడి బంగరు షిరిడి
సాయి షిరిడి చక్కని షిరిడి
1. నిత్యము కాంతితొ నిలచెడి బాబా
సత్యవ్రతుడు సాయి బాబా
సాయి సన్నిధి సత్య సన్నిధి
మనకందరకు మహా పెన్నిధి
2. కులము మతము రాజు రౌతు
కానగరాని కనక క్షేత్రము
నిత్యము జనుల మనో ఫలకమ్మున
వేల కాంతులతొ వెలగెడి క్షేత్రము
3. షిరిడి వాసుని క్షేత్రము నందు
చింతలన్నియును చిటికెలొ తొలగు
వెతలన్నియును తీరుట కొరకు
దర్శించండి సాయి నాధుని
రచన: కొడవంటి...smkodav@gmail.com
**************************************************
3. సాయి నాధుని స్మరణము
ప..సాయి నాధుని స్మరణము
సర్వ పాప హరణము
1. మనుషులందలి మలినములను
తనవి యనుకొని వగచును
తనివితీర మనలను
తండ్రివలె కాపాడును
2. కనికరమునే చూపెడి
కమనీయ హృదయుడు
కలిమిలేములు యేమియు
దరిని చేరని ధన్యుడు
3. తనను నమ్మిన వారిని
తప్పకను లాలించును
భక్తితోడ కొలచిన
బాధలన్నియు బాపును
రచన: కొడవంటి....smkodav@gmail.com
======================================
4. షిరీడి వాసుని దివ్య నామము
ప..షిరీడి వాసుని దివ్య నామము
సాయిబాబా సత్య నామము
1. నిత్యమైన సాయి నామము
నిత్య సత్యమైన నామము
కష్ట నష్టములను బాపి
సుఖములొసగెడి సాయి నామము
2. కరుణ నిండిన సాయి నామము
మరువలేని సాయి నామము
మననమునకు మంచి నామము
మహిమగల మన సాయి నామము
3. చింతలన్నియు తీర్చు నామము
చిద్విలాసంబగు నామము
మనసు రంజిల్లెడి నామము
మర్మమెరుగని సాయి నామము
రచన: కొడవంటి...smkodav@gmail.com